కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే కొత్త మహమ్మారి ఇదేనా

నెల కిందట చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ ఇప్పటికే 20కి పైగా దేశాలకు వ్యాపించింది.


ఇది ఇంకా ఎన్ని దేశాలకు వ్యాపిస్తుందో, ఇంకెంతమంది దీని బారిన పడతారో అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.


దీన్ని ఇప్పటివరకు మహమ్మారిగా ప్రకటించనప్పటికీ ముందుముందు ప్రపంచం ఎదుర్కోబోయే మహమ్మారి ఇదే కావచ్చన్న అంచనాలతో సిద్ధమవుతున్నా,


మహమ్మారి అంటే..


ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలకు ముప్పుగా పరిణమించే అంటు రోగాల తీవ్రతను చెప్పడానికి ఈ పదాన్ని వాడతారు.


ఇటీవలి కాలంలో చూస్తే 2009లో ఒక్కసారిగా విజృంభించిన స్వైన్ ఫ్లూను మహమ్మారిగా చెప్పవచ్చు. అప్పుడు ఈ వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.


అంతవరకు గుర్తించని కొత్త వైరస్‌లు, ఒకరి నుంచి మరొకరికి సులభంగా సోకేవి మహమ్మారులుగా మారతాయి. కరోనా వైరస్ ఈ కోవలోకే వస్తోంది.


దీన్ని నివారించడానికి ఇంకా వ్యాక్సిన్లు కానీ, నయం చేయడానికి సమర్థమైన చికిత్సలు కానీ ఇంకా అందుబాటులోకి రానందున దీని వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు.