కరోనావైరస్ లక్షణాలు: ఎలా గుర్తించాలి, నన్ను నేను ఎలా కాపాడుకోవాలి,

కరోనావైరస్ వేగంగా విస్తరిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 8,00,049 మందికి ఈ వైరస్ సోకింది. మృతుల సంఖ్య 37,878కి చేరుకుంది.


భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 1357కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం ఇప్పటివరకు 32 మంది చనిపోయారు. కేరళలో అత్యధికంగా 221 కేసులు నమోదయ్యాయి. ఒక వ్యక్తి చనిపోయారు. మహారాష్ట్రలో 223 కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు.


అమెరికాలో అత్యధికంగా 1,64,610 మందికి కరోనావైరస్ సోకింది. మంగళవారం నాటికి 3,170 మంది వైరస్ బారిన పడి చనిపోయారు.


ఇటలీలో ఇప్పటికే 11,591 మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ మొత్తంగా 1,01,739 మందికి సోకింది. ఆ తరువాత స్థానంలో నిలిచిన స్పెయిన్‌లో 94,417 మంది వైరస్ బాధితులు నమోదయ్యారు. 8,189 మంది మృతి చెందారు.