త్వరలోనే సమస్యలు లేని వార్డ్ గా మారుస్తాం


(స్టార్ 1234 మీడియా ,విశాఖపట్నం)

త్వరలోనే సమస్యలు లేని వార్డ్ గా మారుస్తామని 33వవార్డ్ కార్పొరేటర్ బీశెట్టి వసంత లక్ష్మి తెలిపారు.బుధవారం బీశెట్టి వసంత లక్ష్మి నేతృత్వంలో దక్షణ నియెజకవర్గ జనసేన నాయకులు గోపీకృష్ణ (జీ కె)పాల్గొని వార్డులో డ్రైనేజ్ సమస్యలను గుర్తించి ఆ సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అధికారులు స్పందించి శుభ్రం చేయించారు.స్థానిక ప్రజలకు రోడ్లు,వీధి దీపాలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు.మాస్క్,భౌతిక దూరం పాటిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజర్ వినియోగించుకోవాలని తెలియజేశారు.చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.