ఐఎస్‌ఐ బ్రాండ్‌ హెల్మెట్‌ను వినియెగించాలి:సీఐ వెంకటరమణ..
(యలమంచిలి,జూలై,28 స్టార్1234మీడియా )చోదకులు తప్పని సరిగా ఐఎస్‌ఐ బ్రాండ్‌ ఉన్న హెల్మెట్‌ను వినియోగించాలని యలమంచిలి సీఐ వెంకటరమణ సూచించారు.బుధవారం యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు యలమంచిలి పోలీసులు ద్విచక్రవాహనలపై హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు.పోలీసుల జరిమానా విధిస్తారనే ఉద్దేశ్యంతో చాలా మంది నాసిరకం హెల్మెట్లు వినియోగించడం వల్ల ఉపయోగం ఉండదని,దానివలన ప్రమాద సమయంలో ప్రాణాపాయం కు గురౌతారని బతికే అవకాశలు తక్కువగా ఉంటుదని సీఐ వెంకటరమణ పేర్కొన్నారు.ఐఎస్‌ఐ బ్రాండ్‌ హెల్మెట్ వినియోగించడం వల్ల ప్రాణాలను రక్షించుకోవచ్చుని చెప్పారు.ఈ కార్యక్రమంలో  ఎస్ఐ లు నీలకంఠరావు,సన్నీ బాబు,ట్రాఫిక్ ఎస్ఐ వెంకట్రావు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు