జీ కే కు శుభాకాంక్షలు వెల్లువ...
ముఖ్యనాయకులు,జీ కే ఫౌండేషన్ అధినేత గోపీకృష్ణ(జీ కే)కు మంగళవారం పుట్టినరోజు సందర్భంగా ఆయన స్నేహితులు బంధువులు శ్రేయోభిలాషులు నగర జనసైనికులు నగర జనసేన ప్రధాన నాయకులు ఆయన కు శుభాకాంక్షలతో ముంచెత్తారు.. ఈ సందర్భంగా జీవీఎంసీ 33వవార్డులో జనసైనికులు ఆయన చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.గోపికృష్ణ(జీ కే) జనసేనపార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీలో ఉంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పలు సమస్యలపై పోరాడారు.జీ కే ఫౌండేషన్ను ఏర్పాటు చేసి పలు సేవ కార్యక్రమాలు చేస్తూ విశేషఆదరణపొందుతున్నారు. జీవీఎంసీ కార్పొరేషన్ ఎన్నికలలో తన సతీమణిని బీశెట్టి వసంతలక్ష్మి ని జనసేన పార్టీ నుంచి బరిలోకి దింపి ఆమె గెలుపుకు విశేష కృషి చేసి తానేంటో నిరూపించుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన సతీమణి గెలుపు ఒక బహుమతిగా అందించారు.ఈ సందర్భంగా గోపికృష్ణ(జీ.కే)మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలోజనసేనపార్టీ బలోపేతానికి జనసైనికులతో కలిసి వార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..