రమ్య దారుణ హత్య ప్రభుత్వ వైఫల్యమే...జనసేనపార్టీ ఆరోపణ...
స్టార్ 1234 మీడియా, విశాఖపట్నం

గుంటూరులో జరిగిన బిటెక్‌ విద్యార్థిని రమ్య హత్య ఘటనపై మంగళవారం ఉదయం నగరంలో ఎల్ఐసి బిల్డింగ్ కూడలి వద్ద జనసేనపార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేనపార్టీ వీర మహిళలు ప్లకార్డులు చేత పట్టి నిరసన ప్రదర్శన తెలియజేస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా జనసేనపార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త పసుపులేటి ఉషాకిరణ్,జీవీఎంసీ 33వ వార్డు కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి లు మాట్లాడుతూ రమ్య దారుణ హత్య ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు.ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలోనే ఘటన జరిగిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు,బాలికలపై అత్యాచారాలు నిత్యకృతమైపోయాయన్నారు.రాష్ట్రంలో ఎక్కువగా ఎస్సీలపైనే అఘాయిత్యాలు జరుగుతున్నా ఎస్సీ మహిళ హోంమంత్రి ఉండి కూడా స్పందించడం లేదని మండిపడ్డారు.బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని,కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.